ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
శాశ్వత కాలమునుండి శాశ్వతకాలము వరకు
స్తుతింప బడునుగాకా .. ఆమెన్ ఆమెన్
కీర్తనలు 41 : 13
యెహోవా దేవుడు ఎందుకు స్తుతింపబడాలి
1. ఆయన ప్రేమ శాశ్వతమైనది : యిర్మియ 31:3
యెహోవా దేవుడు తన ప్రేమ చేత మన ప్రాణములను నాశనమను
గోతి నుండి విడిపించి , మన పాపములాన్నియు తన వీపు వెనుకాల
పారవేసినాడు యెషయా 38:17
నన్ను ప్రేమించి , నా కొరకు తనను తాను అప్పగించుకోనిన దేవుని
కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను
గలతీయులకు 2:20
2. ఆయన శాశానములన్నియు నమ్మకమైనవి
అవి శాశ్వతముగా స్థాపింపబడినవి
సత్యముతోను యధార్ధముతోను అవి చేయబడియున్నవి
కీర్తనలు 11 1 : 6, 7
a. నీ శాశానములు నాకు సంతోషకరములు
అవి నాకు ఆలోచనకర్తలైనవి కీర్తనలు 119 24
b. నీ శాశానములను నేను హత్తుకొనియున్నాను
నన్ను సిగ్గుపడనీయవు కీర్తనలు 119:31
c. నీ శాశానములు నాకు హ్రుదయానందకరములు
అవి నాకు నిత్యస్వాస్త్యమని భావించుచున్నాను
కీర్తనలు 119:111
3. ఆయన కృప శాశ్వతమైనది :
దావీదునకు చూపిన శాశ్వతమైన కృప యెహోవా దేవుడు
మనఎడల చూపుతున్నారు యెషయా 55:3
పర్వతములు తొలగిపోయిన , మెత్తలు తత్హరిల్లిన
యెహోవా దేవుని యొక్క కృప మనలను విడిచిపెట్టడు యెషయా 54:10
4. ఆయన నీతి శాశ్వతమైనది : కీర్తనలు 119 :142
ఆయన తన నీతిని బట్టి మనలను బ్రతికిస్తున్నాడు కీర్తనలు 119:40
ఆయన తన నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చుచున్నాడు యెషయా 11 : 4
5. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై యున్నాడు
న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును
స్థాపించి యున్నాడు కీర్తనలు 9 : 7
6. శాశ్వితుడైన దేవుడు నీకు నివాస స్థలమగును ద్వితియోపదేసకాండము 33 : 27
నీకు అపాయమేమియు రాదు
ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
అపాయమేమియు కీర్తనలు 91 : 9 , 10
7. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదేన్నటికిని తొలగిపోదు ; ఆయన
రాజ్యము ఎప్పుడును లయము కాదు దానియేలు 7 : 14
ఆయన అన్నిటి మీద రాజ్యపరిపాలన చేయుచున్నాడు కీర్తనలు 103:19
క్రీస్తునందు మీ ప్రియసహోదరి
Jayaseela
93970 58222 ... phone
jaya-seela.blogspot.com
jayaseela22@gmail.com
యెహోవా దేవుడు శాశ్వత కాలమునుండి శాశ్వతకాలము వరకు ఎందుకు స్తుతింపబడాలి
Views:
Category:
Messages
0 comments:
Post a Comment