ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు అందరికి నా హృదయపూర్వక వందనములు
ఈ దినము మనము యోహాను 2:1-11 వచనము వరకు ద్యానము చేద్దాము :
నేను ఈ వాక్యము చదువుతున్నపుడు దేవుడు నాకు ఒక తలంపు యిచ్హారు అదేమిటంటే . యోహాను సువార్త రెండవ అధ్యాయం మొదటి వచనంలో .... గలిలయ లోని
కానా అను ఉరులో ఒక వివాహము జరిగెను అని ఉన్నదికదా ... గలిలయ అంటే ఈ లోకంలో కానా అంటే ఒక వ్యక్తి పేరు ఉరు అంటే జీవితం ... ఉదాహరణగా ఈ లోకంలో జయశీల అను ఒక వ్యక్తి జీవితంలో అని అర్ధం .
ఈ వచనంలో వివాహమునకు బదులు మన జీవితంలో ఒక ఉద్యోగము కాని , ఒక సొంత గ్రహము కాని ఒక వాహము కాని ఏదైనా మనము పొందియున్నాము అని భావించాలి
యోహాను సువార్త రెండవ అధ్యాయం రెండవ వచనంలో యేసు తల్లి అక్కడ ఉండెను ;యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి దీనికి అర్దము ఏమిటి అంటే ...
ఆ శుభకార్యము జరుపుకుంటున్న వారు ఎలాగు అయితే యేసుప్రభువును , యేసుభువు యొక్క తల్లిని , యేసుభువు యొక్క శిష్యులను ఆహ్వానించారో ....
మనము కూడా మన యొక్క జీవితంలో కూడా ఒక మంచి కార్యము జరగాలంటే , మొదటగా మనము మన ప్రభువైన యేసు క్రీస్తును మన జీవితంలోకి ఆహ్వానించాలి
యోహాను సువార్త రెండవ అధ్యాయం మూడవ వచనంలో ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి - వారికి ద్రాక్షారసము లేదని ఆయతో చెప్పగా ......
దీనికి అర్దము ఏమిటి అంటే .... మన యొక్క జీవితంలో కూడా ఏదయితే కొదవగా ఉన్నదో .... కొదవ అనగా ఉద్యోగం లేకపోయినా , పిల్లలు లేకపోయినా , వాహనం లేకపోయినా , మన జీతం పెరగాలన్న ... మనమ దేవునికి ప్రార్దన పూర్వకంగా తెలియజేయాలి
యోహాను సువార్త రెండవ అధ్యాయం నాల్గవ వచనంలో : యేసు ఆమెతో - అమ్మా , నాతో నీకేమి (పని) ? నా సమయము యింకను రాలేదనెను ..... దీనికి అర్దము ఏమిటి అంటే ... మన యొక్క జీవితంలో కూడా ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నామో ,
ఏ పిల్లలు ఎదురు చూస్తున్నామో , ఏ సొంత గృహము కోసం ఎదురు చూస్తున్నామో .... ఆ అవసరతను మనము పొందేవరకు దేవుని యొక్క సమయము కొరకు ఎదురు చూడాలి .....
దేని కాలమందు అది చక్క ఉండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు ప్రసంగి 3:11వ వచనంలో దేవుడు మనకు తెలియచేసినవిదంగా మన కార్యము జరిగే వరకు ఓర్పుగా కనిపెట్టాలి
ఒకవేళ మనము అనుకున్న సమయంలో మన అవసరతను పొందాలి అని మనము దేవున్ని పట్టు పట్టి అడిగిన్నప్పుడు .. దేవుడు మన జీవితంలో చేస్తారు కాని .. ఆ అవసరతను పొందిన తరువాత ఏదయిన సమస్య వచిన్నపుడు ..
మరల మనము దేవుడిని అడిగిన్నప్పుడు ... నీ సమయంలో ఈ అవసరతను కావాలి అడిగియున్నావు కదా ... యిదే మనము దేవుడు తన యొక్క సమయంలో ఆ అవసరతను పొందినప్పుడు , అది ఎంతో ఆసీర్వాదకరంగా ఉంటుంది .
యిక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి అది ఏమిటి అంటే ...
మనము మన జీవితంలో ఒక అద్బుత కార్యాని పొందాలి అంటే దేవుడు మనలను
ఒకటి చేయమంటున్నారు అది ఏమిటో చూద్దాము ఒకే ..
యోహాను సువార్త రెండవ అధ్యాయం అయిదు , ఆరు , ఏడు వచనాలలో .... యేసు తల్లి పరిచారకులను చూచి ... ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను ....
యూదుల శుదీకరనచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానాలు అక్కడ ఉంచబడియుండెను . యేసు ఆ బానలు నీళ్ళతో నింపుడి అని
వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి ... యిక్కడ రాతి బానలు అనగా రాతి లాంటి హృదయాలు అని యేహెజ్కేలు 36:26 లో దేవుడు మనకు తెలియజేస్తున్నారు
అలాగే ప్రభువైన ఏసుక్రీస్తు కూడా మనలను చూచి రాతి లాంటి మన యొక్క హృదయము అంచుల వరకు నీరు అనే వాక్యమును నింపమని కోరుతున్నారు ...
యోహాను సువార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో
అప్పుడాయన వారితో - మీరిప్పుడు ముంచి , విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళండి
అని వారితో చెప్పగా , వారు తీసుకోనిపోయిరి ... అలాగే మనము కూడా ఏ వాక్యమును మన హృదయములో నింపుకొని , ధ్యానము చేస్తున్నామో ఆ వాక్యమును మన స్నేహితులకు , మన బందువులకు , మన యిరుగుపొరుగు వారికి ఆ వాక్యమును తెలియజేయాలి ..
మనము యితరులకు ఏదైయిన వాక్యమును చెప్పేముందు మనలో మనకు ఒక ఆత్మీయ భయము ఏర్పడుతోంది అది ఏమిటి అంటే ... నేను వాక్యము యితరుకు చెప్తున్నాను కాని ముందుగ నేను ఈ వాక్యము ప్రకారము జీవిస్తున్నాన ...
ఎప్పుడైయితే ఈ భయము మనలోనికి వస్తుంది మందుగా మనము ఆ వాక్యము ద్వారా సరిచేయబాడతాము .. ఎప్పుడైయితే మనము సరిచేయబాడతామో అప్పుడు మనలో ఉన్న పాతస్వభావము పోయి నూతనమైన స్వభవములొనికి మార్చబడతాము
యోహాను సువార్త రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో :
ఆ ద్రాక్షారసము ఎక్కడినుండి వచేనో ఆ నీళ్ళు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసిందిగాని విందు ప్రధానికి తెలియకపోయెను దీనికి అర్దము ఏమిటి అంటే ... యింతకముండు మీకీ తెలియచేసిన విదముగా నీళ్ళు అనగా వాక్యము అని
ఆ వాక్యమును మనము ఎంతగా చదివి , ధ్యానము చేస్తామో అంతగా దేవుడు మనలో దినదినము మన యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొని వస్తారు
దేవుడు యోహాను సువార్త రెండవ అధ్యాయంలో నీళ్ళను ద్రాక్షారసముగా మార్చారు
దేవుడు నీళ్ళను ద్రాక్షారసముగ మార్చాక ముందు నీళ్ళలో ద్రాక్షా రంగు లేదు , ద్రాక్షారసము వాసన లేదు , ద్రాక్షారసము యొక్క రుచి లేదు .... అలాగే దేవుని యొక్క వాక్యమును మనలోనికి నిమ్పపకముందు , ప్రభువైన యేసు క్రీస్తును మన జీవితంలోనికి ఆహ్వానిచకముందు .. మనము కూడా అతి సామాన్యమైన మనుష్యులమే
అంతకముందు చాల కోపం, స్వార్దం , అసూయ, పగ , ద్వేషమగా ఉండేవాళ్ళము యిప్పుడు ప్రేమ , దయ , జాలి , యితరులకు సహాయం చేసే గుణము
ఈ విదంగా దేవుడు ఒక పాపిని పరిశుధంగా మార్చుతాడు
ద్రాక్షారసపు రంగు అనగా పరిశుధుడు అని , ద్రాక్షారసపు రుచి అనగా పరిశుద క్రియలు , ద్రాక్షారసపు వాసన ఉజీవము , జీవపు కళ
పరిశుద గ్రంధమైన బైబిల్లో పౌలు 1తిమొథి 1:12,13 వచనాలలో పూర్వము దుషకుడను ,హిమ్సకుదను , హానికరుడైన నేను తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనుకరించబడితిని ... మనము కూడా దేవుని ప్రేమ తెలియక
అవిశ్వాసము వలన చేసాము గనుక మనము మనపాపములను ఆయన
సన్నిదిలో ఒప్పుకున్నఎడల ఏసుప్రభువు నిన్ను పరిశుడుగా ఎంచటానికి
సిద్దంగా ఉన్నాడు
మనము పరిశుదులుగా , నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్దనల వైపు
చెవియోగ్గుతాడు సామెతలు 15:29
నీతిమంతులు ఏ అవసరత గురుంచి ప్రార్దించినప్పుడు ఆ అవసరతను తీర్చుతాడు
యోహాను సువార్త రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో :
గలియలోని కానాలో , యేసు ఈ సూచిక క్రియను చేసి తన మహిమను
బయలుపరిచెను అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విస్వసముంచిరి అనగా గలిలయ అనగా ఈ లోకలో , కానా అనగా ఒక వ్యక్తి యొక్క పాపి జీవితమును
సూచిక క్రియ అనగా పరిశుద్ధముగా మార్చుట ... మనము మనయొక్క జీవితాంతము
మన యేసయ్య యందు విశ్వాసముంచి , మన ప్రభువైన యేసు క్రీస్తు నామమును
మహిమ పరుచాదము ...
యేసయ్యకె సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాకా ఆమెన్ .
క్రీస్తునందు మీ ప్రియసహోదరి
Jayaseela
93970 58222 ... phone
jaya-seela.blogspot.com
jayaseela22@gmail.com
ఈ దినము మనము యోహాను 2:1-11 వచనము వరకు ద్యానము చేద్దాము :
Views:
Category:
Messages
0 comments:
Post a Comment