New Songs

Recent Songs and Messages Fullness of Joy In His Presence








ఇశ్రాయేలు  దేవుడైన  యెహోవా
శాశ్వత కాలమునుండి  శాశ్వతకాలము వరకు
స్తుతింప బడునుగాకా  .. ఆమెన్  ఆమెన్
      కీర్తనలు  41 : 13



యెహోవా  దేవుడు ఎందుకు  స్తుతింపబడాలి



1.    ఆయన ప్రేమ   శాశ్వతమైనది : యిర్మియ 31:3



         యెహోవా దేవుడు  తన ప్రేమ చేత  మన ప్రాణములను  నాశనమను
         గోతి నుండి  విడిపించి , మన పాపములాన్నియు  తన  వీపు వెనుకాల 
        పారవేసినాడు               యెషయా  38:17



        నన్ను  ప్రేమించి , నా కొరకు తనను తాను అప్పగించుకోనిన దేవుని
       కుమారుని యందలి  విశ్వాసము  వలన జీవించుచున్నాను
                          గలతీయులకు  2:20



2.      ఆయన  శాశానములన్నియు  నమ్మకమైనవి

         అవి  శాశ్వతముగా  స్థాపింపబడినవి

        సత్యముతోను  యధార్ధముతోను  అవి చేయబడియున్నవి
                          కీర్తనలు  11 1 : 6, 7 



     a. నీ    శాశానములు  నాకు  సంతోషకరములు
                     అవి  నాకు   ఆలోచనకర్తలైనవి   కీర్తనలు 119  24
 
     b. నీ  శాశానములను  నేను  హత్తుకొనియున్నాను
                    నన్ను సిగ్గుపడనీయవు  కీర్తనలు 119:31  
 
     c. నీ    శాశానములు  నాకు   హ్రుదయానందకరములు
                    అవి నాకు నిత్యస్వాస్త్యమని  భావించుచున్నాను
                             కీర్తనలు 119:111



3.   ఆయన  కృప శాశ్వతమైనది :



      దావీదునకు  చూపిన   శాశ్వతమైన కృప  యెహోవా దేవుడు
       మనఎడల  చూపుతున్నారు    యెషయా  55:3



     పర్వతములు తొలగిపోయిన , మెత్తలు  తత్హరిల్లిన 
     యెహోవా దేవుని యొక్క  కృప మనలను విడిచిపెట్టడు యెషయా  54:10



4.   ఆయన నీతి   శాశ్వతమైనది  : కీర్తనలు 119 :142



         ఆయన  తన  నీతిని  బట్టి  మనలను బ్రతికిస్తున్నాడు  కీర్తనలు 119:40  
        ఆయన  తన  నీతిని  బట్టి  బీదలకు  తీర్పు తీర్చుచున్నాడు   యెషయా   11 : 4



 
 5.   యెహోవా  శాశ్వతముగా  సింహాసనాసీనుడై యున్నాడు
        న్యాయము  తీర్చుటకు  ఆయన  తన సింహాసనమును
        స్థాపించి యున్నాడు       కీర్తనలు  9 : 7



6.   శాశ్వితుడైన  దేవుడు  నీకు  నివాస స్థలమగును ద్వితియోపదేసకాండము 33 : 27



               నీకు అపాయమేమియు రాదు
               ఏ  తెగులును  నీ గుడారమును   సమీపించదు
                అపాయమేమియు  కీర్తనలు  91 : 9 , 10



7.    ఆయన  ప్రభుత్వము  శాశ్వతమైనది అదేన్నటికిని తొలగిపోదు ; ఆయన
       రాజ్యము  ఎప్పుడును   లయము  కాదు   దానియేలు  7 : 14

       ఆయన అన్నిటి మీద రాజ్యపరిపాలన  చేయుచున్నాడు  కీర్తనలు 103:19




క్రీస్తునందు  మీ  ప్రియసహోదరి
Jayaseela
93970 58222 ... phone



jaya-seela.blogspot.com



jayaseela22@gmail.com


 

యెహోవా దేవుడు శాశ్వత కాలమునుండి శాశ్వతకాలము వరకు ఎందుకు స్తుతింపబడాలి



మొట్టమొదటి విషయాన్ని  మనము పాటిస్తే 


1.     మొట్టమొదటిగా  ఆయన సన్నిదిని వెదకితే
        సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు మత్తయి 6:33


2.     సిలువలో పలికిన  మొట్టమొదటి  మాట
        తండ్రి వీరు ఏమి చేయుచున్నారో  వీరు ఎరుగరు
        వీరిని క్షమించుము  లూకా 23:34 ; మత్తయి 6:14,15


3.     నూతన నిభందన గ్రంధములో ఇచిన  మొట్టమొదటి  ఆజ్ఞ
        నీ పూర్ణ హృదయముతో నీ పూర్ననాత్మతోను నీ పూర్నమనస్సుతోను  నీ
        దేవుడైన యెహోవాను  ప్రేమిమ్పవలెను  మత్తయి 22:37


4.     కొండమీద చెప్పిన  ప్రసంగాలలో   మొట్టమొదటి మాట
        ఆత్మ విషయమై  దీనులైన వారు ధన్యులు , పరలోక రాజ్యము వారిది 
          మత్తయి 5:3


5.     ఆత్మఫలములలో మొట్టమొదటి ఫలము  ప్రేమ  కలిగియుంటే
                                    గలతీయులకు 5:22...రోమా 8:9


6.      దేవుడు మనకు ఇచిన  గర్బఫలమును దేవునికి  ఇస్తే
         హన్నా తన మొదటి గర్భఫలమును అనగా మొదటి కుమారుని దేవుని సేవకు
         ఇచినప్పుడు... తిరిగి దేవుడు హన్నకు  ముగ్గురు మగ పిల్లలను , ఇదరు
         ఆడ పిల్లలను  ఇచ్చాడు  1సముయెలు 1:24-28; 1సముయెలు 2:21



7.    మన కష్టార్జితములో దేవునికి ప్రధమ ఫలము ఇస్తే
       ఆకాశావాకిన్డ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను  కుమ్మరిస్తాడు
             మలాకి 3:10



క్రీస్తునందు  మీ  ప్రియసహోదరి
Jayaseela

93970 58222 ... phone

jaya-seela.blogspot.com

jayaseela22@gmail.com 

మొట్టమొదటి విషయాన్ని మనము పాటిస్తే






ఆకాశములు  దేవుని మహిమను  వివరించుచున్నవి  కీర్తనలు 19:1-4

ఆకాశములు దేవుని మహిమను  ఏ విదముగా  వివరించుచున్నవి ...

1.  దేవా నీ  నీతి  మహా ఆకాశమంత  ఉన్నతమైనది  కీర్తనలు 71:19

2. నీ కృప  ఆకాశము కంటే  ఎతైనది ;
   నీ సత్యము మేఘమండలము వరకు  వ్యాపించి యున్నది  కీర్తనలు 57:9

3. ఆయన ప్రభావము భూమిఆకాశములకు  పైగానున్నది   కీర్తనలు 148:13

4. ఆయన మహిమ  ఆకాశావిశాలమున వ్యాపించియున్నది  కీర్తనలు 113:4

5.   దేవా నీ నామము ఎంత గొప్పదో
     నీ కీర్తియు భుదిగంతముల  వరకు  అంత గొప్పది  కీర్తనలు 48:10

6.  ఆకాశములు  భూమికి పైన  ఎంత యెత్తుగా   ఉన్నవో
     మీ మార్గముల కంటే   నా  మార్గములు
     మీ  తలంపుల కంటే నా తలంపులు అంత ఎతుగా ఉన్నవి  యెషయ  55:9

7. పైన   ఆకాశమందు మహాత్కార్ములను
    క్రింద భూమి మీద సూచిక క్రియలను  కలుగ చేసెను  అపోస్తులకార్యములు 2:19......నిర్గమకాండము 16:15 ఆకాశమునుండి  మన్నా పడుట


క్రీస్తునందు  మీ  ప్రియసహోదరి
Jayaseela

93970 58222 ... phone

www.jaya-seela.blogspot.com

jayaseela22@gmail.com

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి







మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి ,అప్పుడవన్నియు మీకు అనుగ్రహించాబాడును మత్తయి   6:33

ఏ విదముగా ఆయన  రాజ్యమును  మొదట వెదకాలి  

1.  దావీదు ఈలాగు తెలియచేస్తున్నాడు ; వేకువనే నిన్ను వెదకెదను కీర్తనలు 63:1

    వేకువ  అనగా యింకా చీకటి ఉండగానే  మార్కు  1:35

    వెదకుట అనగా :

 ఉదయమున  దేవుని కృపను గూర్చి పాడాలి కీర్తనలు 92:1-3

 ఉదయమున నా ప్రార్దన నీ సన్నిదిని  సిద్ధము చేసి కాచియుందును కీర్హ్తనాలు 5:3




2.   హృదయపుర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకాలి  1దినవ్రుథన్థములు 22:19

కాలేబు ఇశ్రాయేలు  దేవుడైన యెహోవాను  నిండు మనస్సుతో అనుసరిచాడు గనుక
యెహోషువా అతనిని దీవించి  అతనికి  హేబ్రోను  స్వాస్త్యముగా ఇచెను
                 యెహోషువా 14:13


    

3.   యెహోవ మీకు దొరుకు  కాలమునందు ఆయనను  వేదకుడి
ఆయన సమీపములో  ఉదగానె ఆయనను వేడుకోనుడి  యెషయ 55:6


యేసు క్రీస్తు సమీపముగా  ఉండగానే గ్రుడ్డివాడైన  బర్తమయి వేదకాడు ,
" దావీదు కుమారుడ  నన్ను కరుణించి నాకు చూపు దయచుమని " వేడుకోనినప్పుడు
యేసుప్రభువు   బర్తమయికి  చూపును  అనుగ్రహించాడు  మార్కు 10: 46-52




4.   నన్ను జాగ్రత్హగా  వెదకువారు నన్ను కనుగొందురు  సామెతలు  8:17

ముగ్గురు జ్ఞానులు  నక్షత్రము ద్వారా యేసు ప్రభువు యొక్క జన్మ స్థలమును
 జాగ్రత్హగా వెదకి   యేసుప్రభువును  కనుగొన్నారు   మత్తయి    2:8-11



5.  నిత్యము ఆయన  సన్నిదిని  వెదకుడి  1 దినవ్రుథన్థములు 16:11
అన్న  ఒక ప్రవక్తి  దేవాలయము విడువక ఉపవాస ప్రార్ధనలతో  రేయింబవళ్ళు 
దేవునికి సేవ చేయుచుండెను  లూకా  2:36,37


క్రీస్తునందు  మీ  ప్రియసహోదరి
Jayaseela


93970 58222 ... phone

www.jaya-seela.blogspot.com

jayaseela22@gmail.com


ఏ విదముగా ఆయన రాజ్యమును మొదట వెదకాలి




యెహోవాకు ఒక క్రొత్త కీర్తన పాడుడి  కీర్హనలు 149:1

భక్తులు ఘనతనొంది  ప్రహర్శించుదురు గాకా
వారు సంతోషబరితులై   తమ పడకలమీద ఉత్సాహగానము చేయుదురు గాక
                             కీర్హనలు 149:5

మనము  యెహోవాను గూర్చి ఏ విధముగా  క్రొత్తకీర్తనతో , ఉత్సాహంగా  పాడాలి

1.   నా నాలుక నీ నీతిని గూర్చియు  నీ కృపను  గూర్చియు
     దినమెల్ల సల్లాపము చేయును  కీర్తనలు  35 :28 

2.    యెహోవా  యొక్క కృపాతిసయమును నిత్యము కీర్తించెదను  
                                               కీర్తనలు 89:1

3.    నీ బలమును గూర్చి నేను కీర్తించెదను  కీర్తనలు 59:19

4.     రండి యెహోవాను  గూర్చి ఉత్సాహగానము చేయుదుము
        మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గారణము చేయుడుము
                                  కీర్తనలు 95:1

5.     యెహోవాను బట్టి  ఆయన వాక్యమును గూర్చి పాడెదము
                                                              కీర్తనలు 56:10

6.    నేను  కృపను  గూర్చియు , న్యాయమును  గూర్చియు పాడెదను
        యెహోవా నిన్ను కీర్తించెదను కీర్తనలు  101 :1

7.    నీ  మహా   దయలత్వము   గుర్చిన  కీర్తిని  వారు  ప్రకటించెదరు
                             కీర్తనలు 145:7


క్రీస్తునందు  మీ  ప్రియసహోదరి
Jayaseela

93970 58222 ... phone

www.jaya-seela.blogspot.com

మనము యెహోవాను గూర్చి ఏ విధముగా క్రొత్తకీర్తనతో , ఉత్సాహంగా పాడాలి




దేవుని యొద్దకు వచునప్పుడు ఆయన ఉన్నాడనియు , తనను వెదకువారికి
ఫలము దయచేయువాడనియు నమ్మవలెను హెబ్రియులకు 11:6

మనము ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించినప్పుడు ,
మనకు ఎటువంటి ఫలములను దయచేయుచున్నాడు

1. ఆయన తాను సృస్తిన్చినవాటిలో మనము ప్రధమ ఫలముగా ఉండునట్లు
సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను యాకోబు 1:18

2. మారుమనస్సుకు తగిన ఫలము మత్తయి 3:7

3. వెలుగు ఫలము సమ్స్తవిధములైన మంచితనము , నీతి , సత్యము వాటిలో
కనబడుచున్నవి ఎఫేస్సియులకు 5: 8,9

4. నీతిఫలము అనగా నిష్కపటము , నిర్దోశము ఫిలిప్పియులకు 1:11

5. ఆత్మఫలమేదనగా - ప్రేమ , సంతోషము , సమాదానము , దీర్గాసాంతము ,
దయలత్వము , మంచితనము , విశ్వాసము , సాత్వీకము , ఆసానిగ్రహము
గలతీయులకు 5:22

6. యెహోవా నీ గర్భఫల విషయములోను , నీ పశువుల విషయములోను ,
నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును
ద్వితియోపదేసకాండము 28:11

7. జయిన్చువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవ్రుక్ష ఫలములు భుజింప నిత్తును ప్రకటన 2:7


క్రీస్తునందు మీ ప్రియసహోదరి
Jayaseela

93970 58222 ... phone

jaya-seela.blogspot.com

jayaseela22@gmail.com

మనము ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించినప్పుడు , మనకు ఎటువంటి ఫలములను దయచేయుచున్నాడు





యెహోవా - నీవు లేచి నీ దేశమునుండియు  నీ బందువలయోద్ధనుండియు నీ తండ్రి ఇంటినుండియు బయలుదేరి  నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము
ఆదికాండము 12:1


తండ్రియైన  దేవుడు  అబ్రహమును నీవు చేస్తున్నటువంటి ఈ విగ్రహారాదన యెహోషువా 24:2 నుండి నీవు లేచి నీ బందువుల నుండి నీ తండ్రి ఇంటినుండి
అనగా ఈ లోక ఆచారాలు , సంప్రదాయాలును విడిచిపెట్టి  నేను చూపించు దేశమునకు వెళ్ళమని అబ్రహామునకు తెలియచేస్తున్నారు


ఒక్క అబ్రహామునకు మాత్రమే కాదు నీవు నేను దేవుని సంగసబ్యులముగ ఉన్న మనకు కూడా తెలియచేస్తున్నట్టు ఉన్నది " కుమారీ , ఆలకించుము ఆలోచించి చేవియోగ్గుము
నీ స్వజనమును నీ తండ్రి  ఇంటిని మరువుము " కీర్తనలు 45:10

దేవుడు మనలను కూడా ఈ లోక ఆచారాలు , సంప్రదాయాలును విడిచిపెట్టమని  కోరుతున్నారు :

ఎప్పుడైయితే మనము  ఈ లోక ఆచారాలు , సంప్రదాయాలును , ఈ లోక అలవాటులను విడిచిపెడతామో  తండ్రియైన  దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు మనకు ఒక దేశమును చుపించబోతున్నారు ,  చూపించటమే కాదు ఆ దేశమును   యిస్తాను అన్నారు 
ఆదికాండము 12:7


 తండ్రియైన  దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు మనకు అనుగ్రహించే  దేశాలు ఏమిటి :

1.  ధాన్య ద్రాక్షా రసములు గల దేశము  ద్వితియోపదేసకాండము  33:28

2. పాలు తెనలు ప్రవహించే   దేశము   నిర్గమకాండము 33:1

3. సజీవులు  ఉండే   దేశము  కీర్తనలు 116:9

4. ఆనందకరమైన   దేశము   మలాకీ 3: 12

5. కనాను  దేశము  ఆదికాండము 17:8

6. శ్రేష్టమైన  దేశము  హేబ్రియులకు 11:16

7. పవిత్రమైన దేశము   యెషయ 62:3


క్రీస్తునందు  మీ  ప్రియసహోదరి
Jayaseela


93970 58222 ... phone

jaya-seela.blogspot.com

jayaseela22@gmail.com

తండ్రియైన దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు మనకు అనుగ్రహించే దేశాలు ఏమిటి ఆదికాండము 12:7





ఆయన పేరు యెహోవ   ఆమోసు 5:9









జీవగ్రన్ధమైన బైబిల్లో ఎన్ని విధములుగా  యెహోవ  కనబడుతున్నారు ,
మన ఆత్మీయ జీవితంలో  ఏమి చేస్తున్నారు


1. కీర్తనీయుడైన యెహోవ : కీర్తనలు 18:3

     కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగ
     ఆయన నా శేత్రువుల  చేతిలోనుండి నన్ను విడిపించెను

      
2.   ఆశ్రయదుర్గమైన  యెహోవా కీర్తనలు  144:1

      నాకు ఆశ్రయదుర్గమైన   యెహోవా సన్నుతింపబడును  గాక
      ఆయన  నా చేతులకు యుద్దమును , నా వ్రేళ్ళకు పోరాటమును
      నేర్పువాడివున్నాడు  


3.   సృష్టికర్తయిన యెహోవా  యెషయ 45:11

     భూమి ఆకాసములను సృస్త్టించిన యెహోవా  నామమువలననే
     మనకు సహాయము  కలుగుచున్నది  కీర్తనలు  124:8

     భూమి ఆకాసములను సృస్త్టించిన యెహోవా  సియోనులోనుండి  నిన్ను
     ఆసీర్వదిన్చుచున్నాడు  కీర్తనలు 134:3


4.   దేవుడైన యెహోవా  ద్వియోపదేసకాండము  1:30

      మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెఒవ మీ కన్నులఎదుట   అయిగుప్తులోను
      అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము  చేయును


5.   నన్ను గర్భమున పుట్టించిన    యెహోవా    యెషయ  49:5

      దేవుడు మనలను ఎందుకు పుట్టించాడు :

       ఈ దినమున నేను సజీవుడనై  నిన్ను స్తుతిన్చుచున్నాను  యెషయ 38:17

       సర్వలోకమునకు  వెళ్లి సర్వసృష్టికి  సువార్త  ప్రకటించుటకు   మార్కు 16:15


6.   న్యాముతీర్చు  యెహోవా  జేఫన్య   3: 5

       ఆయన  ఏ  విధముగా మనకు న్యాయము తీర్చుచున్నారు
      నీవు  నా పక్షమున వ్యాజ్యమాడి  నాకు న్యాయము తీర్చుచున్నావు
      నీవు సింహాసనాసీనుడై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాడు
                                        కీర్తనలు 9:3

       యెహోవా ,  నా నీతినిబట్టియు నా యధార్తను బట్టియు నా విషయములో
       నాకు న్యాయము తీర్చును   కీర్తనలు 7:8


7.   అద్వితీయుడైన  యెహోవా  నెహెమ్య 9:6

     నీవే  అద్వితీయుడైన  యెహోవా, నీవే ఆకాశమును మహాఆకాశములను
     వాటి సైన్యమును ,  భూమిని దానిలో ఉండునది అంతటిని , సముద్రములను
     వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడుచున్నావు .
      ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నవి 



క్రీస్తునందు  మీ  ప్రియసహోదరి
Jayaseela

93970 58222 ... phone

jaya-seela.blogspot.com

jayaseela22@gmail.com

ఆయన పేరు యెహోవ ఆమోసు 5:9





మనము ఎటువంటి క్రియలను  విసర్జించాలి


1.  నిర్జీవ క్రియలను  హెబ్రియులకు 6:1

2 . అక్రమ క్రియలను 2పెతురు  2:8

3.  తిరుగుబాటు క్రియలను మీకా 1:13

4.  అంధకార క్రియలను  రోమా 13:12

5.  మోసపు క్రియలలను మీకా 2:1

6.  దుష్ట క్రియలను  హోషయ  9:15

7.  అపవిత్ర క్రియలను  మీకా 2:10


క్రీస్తునందు  మీ  ప్రియసహోదరి
Jayaseela

93970 58222 ... phone

jaya-seela.blogspot.com

jayaseela22@gmail.com

మనము ఎటువంటి క్రియలను విసర్జించాలి




ప్రభువైన యేసు క్రీస్తు నామమున  మీకు అందరికి  నా  హృదయపూర్వక  వందనములు

ఈ దినము మనము యోహాను  2:1-11 వచనము వరకు ద్యానము చేద్దాము :

నేను ఈ వాక్యము  చదువుతున్నపుడు  దేవుడు  నాకు ఒక తలంపు  యిచ్హారు  అదేమిటంటే . యోహాను సువార్త రెండవ అధ్యాయం మొదటి వచనంలో ....  గలిలయ లోని
కానా  అను ఉరులో ఒక వివాహము జరిగెను అని   ఉన్నదికదా ... గలిలయ  అంటే ఈ లోకంలో  కానా అంటే ఒక వ్యక్తి  పేరు ఉరు అంటే జీవితం  ... ఉదాహరణగా  ఈ లోకంలో  జయశీల  అను ఒక వ్యక్తి జీవితంలో  అని అర్ధం .
ఈ వచనంలో వివాహమునకు బదులు మన జీవితంలో ఒక ఉద్యోగము కాని , ఒక సొంత గ్రహము కాని ఒక వాహము కాని  ఏదైనా మనము పొందియున్నాము అని  భావించాలి

 యోహాను సువార్త రెండవ అధ్యాయం రెండవ  వచనంలో  యేసు తల్లి  అక్కడ  ఉండెను ;యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు  పిలువబడిరి  దీనికి అర్దము ఏమిటి అంటే ...

ఆ  శుభకార్యము జరుపుకుంటున్న  వారు ఎలాగు  అయితే  యేసుప్రభువును , యేసుభువు యొక్క  తల్లిని   ,      యేసుభువు యొక్క శిష్యులను  ఆహ్వానించారో  ....
మనము  కూడా  మన  యొక్క  జీవితంలో  కూడా  ఒక  మంచి  కార్యము  జరగాలంటే  , మొదటగా మనము  మన   ప్రభువైన   యేసు క్రీస్తును  మన  జీవితంలోకి   ఆహ్వానించాలి 

యోహాను సువార్త రెండవ అధ్యాయం మూడవ   వచనంలో    ద్రాక్షారసము  అయిపోయినప్పుడు  యేసు  తల్లి - వారికి  ద్రాక్షారసము లేదని ఆయతో  చెప్పగా  ......
దీనికి అర్దము ఏమిటి అంటే ....  మన  యొక్క  జీవితంలో  కూడా  ఏదయితే    కొదవగా   ఉన్నదో   ....  కొదవ    అనగా  ఉద్యోగం లేకపోయినా ,  పిల్లలు    లేకపోయినా , వాహనం   లేకపోయినా  , మన   జీతం  పెరగాలన్న  ... మనమ   దేవునికి  ప్రార్దన పూర్వకంగా  తెలియజేయాలి 

యోహాను సువార్త రెండవ అధ్యాయం నాల్గవ   వచనంలో : యేసు  ఆమెతో - అమ్మా ,  నాతో  నీకేమి  (పని) ? నా  సమయము  యింకను  రాలేదనెను .....  దీనికి అర్దము ఏమిటి అంటే  ...  మన  యొక్క  జీవితంలో  కూడా  ఏ  ఉద్యోగం  కోసం ఎదురు  చూస్తున్నామో ,
ఏ  పిల్లలు  ఎదురు  చూస్తున్నామో , ఏ సొంత  గృహము    కోసం ఎదురు  చూస్తున్నామో .... ఆ  అవసరతను మనము పొందేవరకు  దేవుని   యొక్క సమయము  కొరకు ఎదురు చూడాలి .....
దేని కాలమందు అది చక్క ఉండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు ప్రసంగి 3:11వ  వచనంలో దేవుడు మనకు తెలియచేసినవిదంగా  మన కార్యము జరిగే వరకు ఓర్పుగా  కనిపెట్టాలి
ఒకవేళ  మనము అనుకున్న సమయంలో  మన అవసరతను పొందాలి అని మనము దేవున్ని పట్టు పట్టి  అడిగిన్నప్పుడు  .. దేవుడు మన జీవితంలో చేస్తారు కాని ..  ఆ అవసరతను పొందిన తరువాత ఏదయిన సమస్య వచిన్నపుడు ..
మరల మనము దేవుడిని అడిగిన్నప్పుడు ... నీ సమయంలో ఈ అవసరతను కావాలి అడిగియున్నావు  కదా ... యిదే  మనము దేవుడు తన యొక్క సమయంలో  ఆ అవసరతను పొందినప్పుడు , అది ఎంతో ఆసీర్వాదకరంగా  ఉంటుంది .
యిక్కడ  మనము ఒక విషయాన్ని గమనించాలి అది ఏమిటి అంటే ...
మనము మన జీవితంలో ఒక అద్బుత కార్యాని పొందాలి అంటే దేవుడు మనలను
ఒకటి చేయమంటున్నారు  అది ఏమిటో చూద్దాము  ఒకే ..
యోహాను సువార్త రెండవ అధ్యాయం  అయిదు , ఆరు  , ఏడు వచనాలలో  .... యేసు తల్లి  పరిచారకులను చూచి ... ఆయన మీతో చెప్పినది చేయుడి  అనెను ....
యూదుల శుదీకరనచార  ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు  రాతిబానాలు అక్కడ ఉంచబడియుండెను . యేసు ఆ బానలు నీళ్ళతో  నింపుడి అని 
వారితో  చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు  నింపిరి  ... యిక్కడ  రాతి   బానలు అనగా రాతి లాంటి హృదయాలు అని  యేహెజ్కేలు 36:26  లో  దేవుడు మనకు తెలియజేస్తున్నారు
అలాగే  ప్రభువైన  ఏసుక్రీస్తు కూడా  మనలను  చూచి  రాతి లాంటి మన యొక్క  హృదయము  అంచుల వరకు నీరు అనే వాక్యమును  నింపమని కోరుతున్నారు ...
యోహాను సువార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ   వచనంలో
అప్పుడాయన వారితో  -  మీరిప్పుడు ముంచి , విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళండి
అని వారితో చెప్పగా , వారు తీసుకోనిపోయిరి ... అలాగే మనము కూడా ఏ వాక్యమును మన హృదయములో నింపుకొని , ధ్యానము చేస్తున్నామో  ఆ వాక్యమును మన స్నేహితులకు , మన బందువులకు , మన యిరుగుపొరుగు వారికి ఆ వాక్యమును తెలియజేయాలి ..
మనము యితరులకు ఏదైయిన  వాక్యమును చెప్పేముందు మనలో  మనకు ఒక ఆత్మీయ భయము ఏర్పడుతోంది  అది ఏమిటి అంటే ... నేను వాక్యము యితరుకు చెప్తున్నాను కాని  ముందుగ  నేను ఈ వాక్యము ప్రకారము జీవిస్తున్నాన ...
ఎప్పుడైయితే ఈ భయము మనలోనికి  వస్తుంది మందుగా మనము ఆ వాక్యము ద్వారా సరిచేయబాడతాము ..    ఎప్పుడైయితే  మనము సరిచేయబాడతామో అప్పుడు మనలో ఉన్న పాతస్వభావము పోయి నూతనమైన స్వభవములొనికి  మార్చబడతాము 

యోహాను సువార్త రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో :
ఆ    ద్రాక్షారసము   ఎక్కడినుండి  వచేనో  ఆ  నీళ్ళు  ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసిందిగాని విందు ప్రధానికి తెలియకపోయెను దీనికి అర్దము ఏమిటి అంటే ...  యింతకముండు మీకీ తెలియచేసిన విదముగా నీళ్ళు అనగా వాక్యము అని
ఆ వాక్యమును మనము ఎంతగా చదివి , ధ్యానము  చేస్తామో అంతగా దేవుడు మనలో దినదినము మన యొక్క ప్రవర్తనలో  మార్పు  తీసుకొని వస్తారు
దేవుడు  యోహాను సువార్త రెండవ అధ్యాయంలో  నీళ్ళను ద్రాక్షారసముగా  మార్చారు
దేవుడు నీళ్ళను ద్రాక్షారసముగ   మార్చాక ముందు  నీళ్ళలో  ద్రాక్షా రంగు  లేదు , ద్రాక్షారసము వాసన  లేదు , ద్రాక్షారసము యొక్క  రుచి లేదు  .... అలాగే  దేవుని  యొక్క వాక్యమును మనలోనికి  నిమ్పపకముందు  , ప్రభువైన  యేసు క్రీస్తును  మన జీవితంలోనికి  ఆహ్వానిచకముందు .. మనము  కూడా  అతి సామాన్యమైన  మనుష్యులమే
అంతకముందు చాల కోపం,  స్వార్దం , అసూయ, పగ , ద్వేషమగా ఉండేవాళ్ళము యిప్పుడు  ప్రేమ , దయ , జాలి , యితరులకు సహాయం చేసే గుణము

ఈ విదంగా దేవుడు ఒక పాపిని పరిశుధంగా మార్చుతాడు

 ద్రాక్షారసపు  రంగు  అనగా  పరిశుధుడు అని , ద్రాక్షారసపు  రుచి అనగా పరిశుద క్రియలు ,  ద్రాక్షారసపు వాసన ఉజీవము , జీవపు  కళ
పరిశుద  గ్రంధమైన బైబిల్లో పౌలు 1తిమొథి 1:12,13  వచనాలలో  పూర్వము దుషకుడను  ,హిమ్సకుదను , హానికరుడైన నేను  తెలియక అవిశ్వాసము వలన  చేసితిని  గనుక కనుకరించబడితిని   ... మనము కూడా దేవుని ప్రేమ తెలియక
అవిశ్వాసము వలన చేసాము  గనుక  మనము మనపాపములను ఆయన
సన్నిదిలో  ఒప్పుకున్నఎడల ఏసుప్రభువు నిన్ను పరిశుడుగా  ఎంచటానికి
సిద్దంగా ఉన్నాడు
మనము పరిశుదులుగా   , నీతిమంతులుగా ఉన్నప్పుడు  దేవుడు మన ప్రార్దనల వైపు
  చెవియోగ్గుతాడు సామెతలు 15:29
నీతిమంతులు ఏ అవసరత గురుంచి  ప్రార్దించినప్పుడు ఆ అవసరతను తీర్చుతాడు

యోహాను సువార్త రెండవ అధ్యాయం పదకొండవ   వచనంలో :
గలియలోని కానాలో , యేసు ఈ సూచిక క్రియను చేసి తన మహిమను
బయలుపరిచెను అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విస్వసముంచిరి అనగా  గలిలయ అనగా  ఈ లోకలో , కానా అనగా ఒక వ్యక్తి  యొక్క పాపి జీవితమును
సూచిక క్రియ  అనగా  పరిశుద్ధముగా మార్చుట ... మనము  మనయొక్క జీవితాంతము
మన యేసయ్య యందు విశ్వాసముంచి , మన ప్రభువైన యేసు క్రీస్తు  నామమును
మహిమ పరుచాదము ...

యేసయ్యకె  సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాకా  ఆమెన్ .

క్రీస్తునందు  మీ  ప్రియసహోదరి
Jayaseela
93970 58222 ... phone
jaya-seela.blogspot.com
jayaseela22@gmail.com

ఈ దినము మనము యోహాను 2:1-11 వచనము వరకు ద్యానము చేద్దాము :





ప్రభువైన   యేసుక్రీస్తు  మనలను  ఎట్టిరీతిగా   నియమించినాడు

1.   కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన  నురుపెడి   మ్రానుగానుగా  నియమించియన్నాను
                            యెషయ  41:15


2.  పెల్లగించుటకు విరుగగొట్టుటకు   నసింపచేయుటకును   పడద్రోయుటకును
     కట్టుటకును  ఈ  దినమున జనులమీదను రాజ్యముల మీదను 
     నిన్ను   నియమించియున్నాను   యిర్మియా  1:10


3. భూమియందంతట  నీవు వారిని అధికారులనుగా  నియమిచియున్నాను
                                                                    కీర్తనలు  45:16

           అధికారాలు  అనగా :

          a. దెయ్యములను  వెళ్లగొట్టే అధికారము మార్కు  3:14
          b. స్వస్తపరిచే అధికారము  లూకా 9:2



4.  భూదిగంతములవరకు  నీవు నేను కలుగచేయు రక్షణకు సాదనముటకై
     అన్యజనులకు  వెలుగైవుండునట్లు  నిన్ను నియమించియున్నాను
                                           యెషయ  49:6

5.  పరిశుదులు సంపూర్నులగునట్లు  క్రీస్తు శరీరము  క్షేమాభివ్రుది  చెందుటకును
     పరిచర్య  ధర్మము  జరుగానట్లును  ఆయన కొందరిని  అపోస్తులులగాను ,
     కొందరిని ప్రవక్తలుగాను , కొందరిని  సువార్తికులుగాను , కొందరిని కాపరులగాను ,
     ఉపదేసకులగాను  నియమించెను  ఎఫేసియులకు  4:13

6.  ఈ దేశమంతటిలో   నీవు  ఎక్కడికి పోయినను ,  ప్రాకారముగల  పట్టనముగాను
     యినుపస్తంభముగాను  ఇత్తడి  గోడలుగాను నీవుండునట్లు ఈ  దినమున    నిన్ను
     నియమించియున్నాను     యిర్మియా  1:18

7.   దేశమును చక్కపరచి పాడిన స్వస్త్యములను పంచిపెట్టుటకై
       నిన్ను కాపాడి ప్రజలకు నిభందనగా నియమించితిని


In Christ
jaya-seela.blogspot.com
jayaseela22@gmail.com

ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఎట్టిరీతిగా నియమించినాడు






Jesus Christ Says that :


Isaiah 45:2 I will go before you.
How God is walking before us or

How god is going before us ..

1. He who opens the breach goes up before them;
   they break through and pass the gate,
   going out by it. Their king passes on before them
             Micah 2:13


2. As a shepherd is going before us John 10:4

3.  Send out your light and your truth; let them lead me;
   let them bring me to your holy hill and to your dwelling
         Psalms 43:3


4. he will go before him in the spirit and power of Elijah   Luke 1:17

5.  the LORD went before them by day in a pillar of cloud to
   lead them along the way, and by night in a pillar of fire
   to give them light, that they might travel by day and by night.
               Exodus 13:21


6. Behold, I send an angel before you to guard you on the way
   and to bring you to the place that I have prepared.
              Exodus 23:20



7.  The LORD your God who goes before you will himself fight for you
             Deuteronomy 1:30



In Christ
jaya-seela.blogspot.com
jayaseela22@gmail.com

Isaiah 45:2 I will go before you. ..... How god is going before us

 
Copyright © Powered by WeboNOise | Templateism |